ప్రభుత్వం అభివృద్ధి పనుల నడుమ రహదారి ఆక్రమణలు మంచి పద్ధతి కాదు : కందుకూరు ఎస్ఐ శివ నాగరాజు...
కందుకూరులోని పామూరు రహదారిలో ఆక్రమణపై మంగళవారం పట్టణ ఎస్ఐ శివ నాగరాజు హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం అభివృద్ధి పనుల నడుమ రహదారి ఆక్రమణలు మంచిపద్ధతి కాదని, 24 గంటల్లోపు తొలగించాలని ఆదేశించారు. దీనిపై స్పందించిన కొల్లూరి కొండయ్య స్వయంగా తొలగిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సహకారం లేకుండా పట్టణాభివృద్ధి సాధ్యం కాదని ఎస్ఐ పేర్కొన్నారు. అధికారులు కూడా ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జరిగింది.