బనగానపల్లె: కొలిమిగుండ్ల మండలంలో అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ఆధ్వర్యంలో త్రాగునీటి సరఫరా
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం పెట్నికోటలో తాగునీటి ఎద్దడి నివారణకు అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ ఆధ్వర్యంలో నీటి సరఫరా ప్రారంభించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలుగు యువత మండల అధ్యక్షులు హుస్సేన్ రెడ్డి తెలిపారు. గ్రామంలో నీటి సమస్య ఉన్న కాలనీలను గుర్తించి ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.