నడికుడి రైల్వే స్టేషన్ ను సందర్శించిన జెడ్ ఆర్ యు సి సి సభ్యురాలు కొంకా రాధ
దక్షిణ మధ్య రైల్వే బోర్డు( జెడ్ ఆర్ యు సి సి ) సభ్యురాలు కొంకా రాధా సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో నడికుడి రైల్వే స్టేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు అవసరమైన సదుపాయాల గురించి స్టేషన్ మాస్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సౌకర్యం మరుగుదొడ్లను పరిశీలించారు. అలాగే దుకాణాల్లో వస్తువులను ఎమ్మార్పీ ధరలకు అమ్ముతున్నారా లేదా అని తనిఖీ చేయడం జరిగింది.