బనగానపల్లె: బెలుం జడ్పి ఉన్నత పాఠశాలలో అర్థంతరంగా ఆగిపోయిన వంటగది నిర్మాణం
కొలిమిగుండ్ల మండలం బెలుం జడ్పీ ఉన్నత పాఠశాలలో వంటగది నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో అపరిశుభ్రత అరకొర వసతుల మధ్యనే రేకుల షెడ్డులో నిర్వాహకులు వంటలు తయారుచేసి విద్యార్థులకు వడ్డిస్తున్నారు. గత వైసీపీ హయాంలో వంటగది నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా ఐదేళ్లయినా నిర్మాణం పూర్తి దశకు చేరుకోలేదు. పాఠశాలలకు తెరిచేలోపు వంటగది నిర్మాణం చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు