పలమనేరు: ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు నిర్వహించిన బిజెపి టిడిపి జనసేన నాయకులు
పలమనేరు: పట్టణం టవర్ క్లాక్ వద్ద కూటమి నాయకులు మీడియాకు వెల్లడించిన వివరాల మేరకు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను నేడు ఘనంగా జరిపామన్నారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పాలాభిషేకం నిర్వహించామన్నారు. అనంతరం బిజెపి తెలుగుదేశం జనసేన పార్టీ కూటమినేతలు. మాట్లాడుతూ, భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావడం మన అదృష్టం ఎన్నో ప్రజా రంజక పథకాలను ప్రవేశపెట్టి శత్రుదేశాల నుండి కంటికి రెప్పలా కాపాడుతున్నాడని కొనియాడారు. ఆయన పుట్టిన రోజు కానుకగా భారత దేశ ప్రజలకు జీఎస్టీ తగ్గించారన్నారు.