ఉరవకొండ: బెళుగుప్పలో శ్రీ గౌరీ దేవి అమ్మవారికి కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు. కార్యక్రమంలో ఆకట్టుకున్న కోలాట నృత్యాలు
అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ రామేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం బుధవారం రాత్రి శ్రీ గౌరీ దేవి అమ్మవారి ఉత్సవ విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్తీక పౌర్ణమి ఉత్సవాల్లో యువతులు చిన్నారులు వేసిన కోలాటం నృత్యాలు ఆకట్టుకున్నాయి.