కనిగిరి పట్టణానికి చెందిన దివంగత కేంద్ర మాజీ మంత్రి పులి వెంకటరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని కనిగిరిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గ వైసిపి మహిళా అధ్యక్షురాలు పి శాంతి, పట్టణ వైసిపి అధ్యక్షులు ఎస్ వి గోవర్ధన్ రెడ్డి జీవనత కేంద్ర మాజీ మంత్రి పులి వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం శాంతి మాట్లాడుతూ.... కనిగిరి శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా వెనుకబడిన కనిగిరి నియోజకవర్గానికి పులి వెంకటరెడ్డి చేసిన సేవలు ప్రశంసనీయమన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.