బోయిన్‌పల్లి: రత్నంపేట గ్రామ శివారు మూలమలుపు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని రోడ్డు ప్రమాదం ఒకరికి తీవ్ర గాయాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయిన్పల్లి మండలం,రత్నంపేట గ్రామ శివారులో మంగళవారం 9:10 PM కి 2 ద్విచక్ర వాహనాలు ఢీకొని రోడ్డు ప్రమాదం జరిగిన ఘటన చోటు చేసుకుంది,వేములవాడకు చెందిన మహేష్ రత్నం పేట గ్రామానికి వచ్చి తిరిగి వేములవాడకు వెళ్తుండగా,బావు పేట నుండి రత్నంపేట కి తన ద్విచక్ర వాహనంపై వెళుతు న్న లక్ష్మణ్,రత్నం పేట గ్రామ శివారు మూలమలుపు వద్ద ఎదురెదురుగా మహేష్ లక్ష్మణ్ ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో మహేష్ కు తీవ్ర గాయాలయ్యాయి,లక్ష్మణ్ స్వల్పగాయలతో బయటపడ్డాడు,దీంతో స్థానికుల సహాయంతో ఇరువురిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రి తరలించారు,ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది,