నారాయణపూర్: మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసం మరోసారి రాజీనామాకు సిద్ధం, సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని లచ్చమ్మ గూడెం గ్రామంలో మంగళవారం సాయంత్రం మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి 33/11 సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గం వెనుకబడి ఉందని, అన్ని రంగాలలో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తన పైన, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పైన ఉన్నదన్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసం మరోసారి రాజీనామాకు సిద్ధమని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి కోసం పాకులాడుతున్నాడని కొందరు అంటున్నారని, అదృష్టం బాగుండి మంత్రి పదవి వస్తే ప్రజలు అభివృద్ధి చెందుతారన్నారు.