కర్నూలు: ప్రజా వైద్యాన్ని ప్రైవేటుపరం చేయకూడదు: కోడుమూరు నియోజకవర్గం సమన్వయకర్త కోట్ల హర్షవర్థన్ రెడ్డి
ప్రజా వైద్యాన్ని ప్రైవేటుపరం చేయకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోడుమూరు నియోజకవర్గంలో విస్తృతంగా కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఆదివారం ఉదయం 12 గంటలు కర్నూలు అర్బన్ లోని 40 వార్డులో కోడుమూరు నియోజవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి,కోడుమూరు ఇన్చార్జ్ ఆదిములకు సతీష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. కోటి సంతకాల సేకరణకు కర్నూలు నగరంలో విశేషంగా స్పందన వచ్చిందని చంద్రబాబు కుట్రపూరిత రాజకీయాలపై ప్రజలు తిరగబడతారని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పార్టీ కోడుమూరు నాయకులు పిలుపునిచ్చారు.