చౌడాపూర్... పిడుగు పాటుకు 5 గెదెలు మృతి.. ప్రభుత్వం ఆదుకోవాలని కొరుతున్న రైతులు
చౌడపూర్ మండల కేంద్రం పరిధిలోని లింగన్న పల్లి గ్రామంలో శుక్రవారం రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో పిడుగు పడి అలకుంట లాల్,తండ్రి ఎర్రన్న అనే రైతు యొక్క 5 గేదెలు పిడుగుపాటుకు మృతి చెందాయి. ఇట్టి గేదెల యొక్క విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి రైతు లాలును ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.