విశాఖపట్నం: విశాఖ : వైసీపీలో ఆ ముగ్గురు ఎవరు? : జగన్ అసంతృప్తికి కారణమేంటి?
వైసీపీ నాయకత్వానికి అంతుచిక్కని పరిస్థితులు నెలకొన్నాయి. 2024 ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత కూడా, దాదాపు 15 నెలలు గడిచినా పార్టీలో స్తబ్దత కొనసాగుతోంది. పార్టీ చేపట్టిన కొన్ని ఆందోళన కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి ఆశించినంతగా వెళ్లలేదని, దీనికి ప్రధాన కారణం నాయకుల్లోని నిర్లిప్తతతేనని చెబుతున్నారు. పార్టీ కోసం పనిచేయాలంటూ అధినాయకత్వం పదేపదే హెచ్చరించినా, చాలామంది నేతలు వాటిని సీరియస్‌గా తీసుకోవడం లేదు. దీంతో వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది. పార్టీలో ఎవరు చురుకుగా ఉన్నారో జగన్ తెలుసుకున్నారు.