పాణ్యం: కల్లూరు అర్బన్ పరిధిలో రోడ్లు, స్మశాన వాటిక, మంచినీటి పైప్‌లైన్లు వేయాలి మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఎం ధర్నా
మున్సిపల్ కౌన్సిల్ హాల్ ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 36, 37, 41 వార్డుల సమస్యలపై ధర్నా నిర్వహించారు. రోడ్ల నిర్మాణం, స్మశాన వాటికకు స్థలం కేటాయింపు, మంచినీటి పైప్‌లైన్లు మరియు కులాయి టాపులు ఏర్పాటు చేయాలని సిపిఎం నగర నాయకులు శ్యామల అధ్యక్షతన మేనేజర్‌కు వినతి పత్రం అందించారు.సిపిఎం నగర కార్యదర్శి టి.రాముడు మాట్లాడుతూ శిథిలమైన రోడ్ల వల్ల ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని, స్మశాన వాటిక లేక పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మాణం, అర్హులకు సామాజిక పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.