మంచి జరిగినా వైసీపీ నేతలు విమర్శిస్తూనే ఉంటారు : టిడిపి నెల్లూరు జిల్లా అధ్యక్షులు అజిజ్ ఫైర్
నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ మన నవ్యాంధ్ర ప్రదేశ్ కు రావటం అత్యంత సంతోషకరమని అన్నారు. అందరం కలిసికట్టుగా దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. గూగుల్ ఆంధ్రకు వచ్చిందని గర్వపడాల్సింది పోయి వైసిపి నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. డేటా సెంటర్ ఆంధ్ర ప్రదేశ్ కి రావటంతో ప్రపంచం మొత్తం మన రాష్ట్రాన్ని చూసి అసూయ పడుతుందని అన్నారు.