సుండుపల్లి: వర్షంలోనూ ఆరని దీపం.. భక్తులను ఆశ్చర్యపరిచిన సంఘటన
అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని టీ.సుండుపల్లి మండలంలోని విరూపాక్షి స్వామి ఆలయంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు, మహిళలు లక్షాది దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా వర్షం కురుస్తున్నా ఓ భక్తురాలు వెలిగించిన దీపం ఆరిపోకుండా వెలుగుతూనే ఉండడం భక్తుల్లో భక్తిభావాన్ని రేకెత్తించింది. దీన్ని శివుని దివ్యమహిమగా భావిస్తూ భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ ప్రాంగణం దీపాల కాంతితో వెలిగిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.