రాజమండ్రి సిటీ: స్వచ్ఛత హి సేవ లో భాగంగా రాజమండ్రి ఆజాద్ చౌక్ లో భారీ మానవహారం
స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి ఆజాద్ చౌక్ సెంటర్లో బుధవారం మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, వివిధ విభాగాల సిబ్బంది, డ్వాక్రా మహిళలు, ఆర్పీలు పాల్గొన్నారు. అనంతరం జరిగిన భారీ ర్యాలీలో ప్లాస్టిక్ వద్దు, గుడ్డ సంచలే ముద్దు, పరిసరాల పరిశుభ్రత, మన అందరి బాధ్యత అని నినాదాలు చేశారు.