తాడికొండ: వెలగపూడిలోని అసెంబ్లీ వద్ద నల్లకండవాలతో నిరసన తెలియజేసిన వైసిపి ఎమ్మెల్సీలు
గుంటూరు జిల్లా వెలగపూడిలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా నేపథ్యంలో సోమవారం వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. నల్లకండువాలతో వైసీపీ ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వచ్చి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ మేరకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వెంటనే విరమించాలని ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను ఆపకపోతే ఉద్యమం కొనసాగిస్తామన్నారు.