అనంతపురం అర్బన్: సంకేపల్లి వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | Apr 2, 2026
శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని ముదిగుబ్బ మండలం సంకేపల్లి వద్ద గత నెల 25వ తేదీన సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పుట్టపర్తి నియోజకవర్గంలోని పాముదూర్త కి చెందిన వసంతప్ప అనే వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన అతనిని చికిత్స నిమిత్తం తరలించగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.