బనగానపల్లె: బనగానపల్లెలో పెద్ది సినిమా విడుదల సందర్భంగా రామ్ చరణ్ అభిమానుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' విడుదల సందర్భంగా బనగానపల్లె పట్టణంలోని టాకీస్ ఆవరణలో రామ్ చరణ్ అభిమానులు రక్తదాన శిబిరం నిర్వహించారు. తలసేమియా బాధిత చిన్నారులు, ప్రమాద బాధితులు, గర్భిణుల అవసరాల కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు అభిమానులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ అచ్చు, షాషా, చందు, ఫణి, మధు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.