నంద్యాల అర్బన్: నంద్యాల-. గిద్దలూరు నల్లమల్ల ఘాట్రోడ్లో లారీ బస్సు డీ, తీవ్ర ట్రాఫిక్ జామ్,పలువురికి స్వల్ప గాయాలు
Nandyal Urban, Nandyal | Apr 14, 2026
నంద్యాల - గిద్దలూరు రోడ్డు మార్గంలోని దొరబావి వంతెన వద్ద మంగళవారం లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రమాద సూచిక బోర్డులు లేకపోవడం వల్లే ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.