పలమనేరు: న్యాయవాదుల బార్ అసోసియేషన్ తీర్మానాన్ని కొంతమంది వక్రీకరించారు - అధ్యక్షుడు ఎల్.భాస్కర్
పలమనేరు: బార్ అసోసియేషన్ తీర్మానాన్ని బార్ సభ్యులే వక్రీకరించి మీడియాకు అందజేశారని అధ్యక్షుడు ఎల్.భాస్కర్ తెలిపారు. నిన్నటి దినం మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. కోర్టు కానిస్టేబుళ్లను తరచూ మార్చాల్సిందిగా డిఎస్పీకు వినతిపత్రం ఇవ్వాలని మెజారిటీ సభ్యులు తీర్మానించామని చెప్పారు. ప్రస్తుతం పనిచేస్తున్న కానిస్టేబుళ్లపై అవినీతి ఆరోపణలు పనిగట్టుకుని చేయలేదన్నారు. పోలీసులు లాయర్ల మధ్య ఎటువంటి వివాదాలు లేవన్నారు, హైకోర్టు లాయర్, న్యాయవాదుల బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ షేక్ షరీఫ్ ఘటనను తీవ్రంగా ఖండించారు.