ఇబ్రహీంపట్నం: మహేశ్వరం మండలంలో మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో రామచంద్రగూడెంలో చెరువుకు గండి
మహేశ్వరం మండలంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో రామచంద్రగూడెంలో చెరువుకు గండి పడింది. గ్రామంలోకి నీరు భారీగా పోటెత్తడంతో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కస్తూర్బా బాలికల పాఠశాల, మోడల్ స్కూల్నూ వరద ముంచెత్తింది. ఇందులోని 475 మంది విద్యార్థులు భవనంపైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది నీటిని తరలించే పనులు చేపట్టారు.