ఆళ్లగడ్డ: అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి: సుదర్శన హోమం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో గురువారం నరసింహ స్వామి జయంతి స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు, దిగువ అహోబిల ఆలయ ప్రాంగణంలో హిమాలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల ఆచార్యులు సుదర్శన హోమం నిర్వహించారు, ఉత్సవమూర్తులైన శ్రీ ప్రహల్లాద వరద స్వామి శ్రీదేవి భూదేవి అమ్మ వాళ్ళను శేష వస్త్రాలు పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు, భక్తులు భారీగా తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు