కావలి: విద్యుత్ కనెక్షన్లు తొలగింపు దారుణం : ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షులు శాంసన్...
కావలి పట్టణంలోని బుడంగుంట ఎస్సీ కాలనీలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా,దౌర్జన్యంగా విద్యుత్ కనెక్షన్లు తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ల్ఫెర్ రాష్ర్ట అధ్యక్షులు శాంసన్ డిమాండ్ చేశారు.శనివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 17వ తేదీన ఒకేసారి 150 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు తొలగింపు దారుణమన్నారు.ఉచిత విద్యుత్ పథకం అమలులో ఉండడంతో ఎస్సీలు ఎవరూ బిల్లు చెల్లించడంలేదు అన్నారు.అధికంగా విద్యుత్ వాడేవారికి ఎందుకు అవగాహన కల్పించలేదని ప్రశ్నించారు.విద్యుత్ ఏఈ , ఏడీలు కలిసి దళితులు అని చిన్నచూపుతోనే దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నట