మాదాపూర్లో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు మిస్సింగ్ కలకలం రేపింది. ట్యూషను వెళ్తున్నామని చెప్పి బ్యాగులు తీసుకుని వెళ్లిన ఇద్దరు పిల్లలు తిరిగి రాలేదు. శ్యామ్ సూర్య వెంకటేశ్, సాయి స్వదీప్ కనిపించడం లేదంటూ బాధిత తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.