ఉరవకొండ: తగ్గుపర్తి గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక పై గ్రామ సభ తో సమీక్ష సమావేశం
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం తగ్గుపర్తి గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక పై శుక్రవారం సాయంత్రం ఎంపీడీవో లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ మౌనిక అధ్యక్షతన గ్రామసభను నిర్వహించారు. గ్రామ సభలో వివిధ గ్రామ అభివృద్ధి, పనులు మరియు జిపిడిపి మరియు ఉపాధి హామీ పథకంలో 2026 27 కు సంబంధించిన ప్రణాళిక తదితర అంశాలపై గ్రామ సభలో చర్చించి తీర్మానాలను ఆమోదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీవో మురళీకృష్ణ గ్రామపంచాయతీ కార్యదర్శి వర్ల శంకర్ మాజీ సహకార సంఘ అధ్యక్షులు వెంకట్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.