అదిలాబాద్ అర్బన్: సమస్యల పరిష్కారానికి సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట గ్రామ పంచాయతీ కార్మికుల నిరసన
గ్రామ పంచాయతీ కార్మికులకు 3 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించి, నూతన యూనిఫామ్, సబ్బులు, నూనె ఇతర సామాగ్రి ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న అన్నారు. సీఐటీయూ అనుబంధ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్యామల దేవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బొజ్జు ఆశన్న మాట్లాడుతూ... మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేసి, జీవో నెంబర్ 51 ని సవరించాలన్నారు. దసర పండుగ రోజున గ్రామ పంచాయతీ కార్మికులను పస్తున ఉంచవద్దని సూచించారు.