ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు మండలం కడిమెట్లలో 'రైతన్న.. మీకోసం' కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సిరి, రైతుల సమస్యలపై చర్చించారు...
ఎమ్మిగనూరు మండలం కడిమెట్లలో 'రైతన్న.. మీకోసం' కార్యక్రమం బుధవారం జరిగింది. వ్యవసాయ, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి.. రైతుల సమస్యలపై చర్చించారు. వాటి సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందని పేర్కొన్నారు.