బనగానపల్లె: భూ వివాదాలు పరిష్కరించడమే ప్రభుత్వ ధ్యేయం బనగానపల్లె ఆర్డీవో నరేంద్రనాథ్ రెడ్డి
భూ వివాదాలను పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం అని బనగానపల్లె ఆర్డీవో నరేంద్రనాథ్ రెడ్డి, కొలిమిగుండ్ల సొసైటీ ప్రెసిడెంట్ అంబటి వివేకానందరెడ్డి పేర్కొన్నారు. గురువారం కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లి గ్రామ పంచాయతీ మజార గ్రామమైన ఎస్.చెన్నంపల్లెలో నిర్వహించిన రెవెన్యూ గ్రామ సభకు ఆర్డీవోతో పాటు కొలిమిగుండ్ల తహశీల్దార్ సాయి విశ్వతేజ, రెవెన్యూ అధికారులు హాజరయ్యారు.