పలమనేరు: నామినేటెడ్ పదవులు ఇచ్చినందుకు MLAఅమర్నాథ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించిన జనసేన నాయకులు
పలమనేరు: శాసన సభ్యులు అమరనాథ రెడ్డిని జనసేన నాయకులు ఘనంగా సన్మానించారు. నామినేటెడ్ పదవుల్లో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, గంగమ్మ, శివాలయం ఆలయ కమిటీలలో జనసేన నాయకులకు సముచిత స్థానం కల్పించనందుకు గానూ వారు ధన్యవాదములు తెలియజేస్తూ ఆయన్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దిలీప్ కుమార్, జనసేన నాయకులు నాగరాజు, హరీష్,శివ, రమేష్, భరత్, రాజేష్, ఆయాజ్ భాషా, శబరీష్, మాధవ, నరేష్, మహేష్ లతో పాటు మురాదు తదితరులు పాల్గొన్నారు.