కోడుమూరు: గ్రీవెన్స్ లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి శుక్రవారం గ్రీవెన్స్ లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పలువురు బాధితులు ఎమ్మెల్యేకు సమస్యలను విన్నవించారు. దీంతో ఎమ్మెల్యే అర్జీలను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు కొన్ని సమస్యలను పరిష్కరించారు. మిగతా సమస్యలపై త్వరతగతిన పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.