నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో క్షుద్ర పూజల కలకలం
Nandyal Urban, Nandyal | Jul 6, 2026
నంద్యాల జిల్లా మహానంది మండల పరిధిలోని నల్లమల అడవిలోని గబ్బుచలమ వద్ద గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేసి తవ్వకాలు జరిగాయని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రతినిత్యం అటవీ అధికారుల పర్యవేక్షణలో ఉన్న ప్రాంతంలో క్షద్ర పూజలు చేసి, గుప్త నిధుల కోసం తవ్వకాలు జరగడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఓ భారీ చెట్టు వద్ద పూజలు చేసి, దాని పక్కనే ఉన్న కాలువలో తవ్వకాలు జరిగినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని అంటున్నారు.