పుంగనూరు: కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిండి మొరువ పారుతున్న చెన్న పట్నం చెరువు.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం ఇరికిపెంట పంచాయతీ. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు చెన్నపట్నం చెరువు పూర్తిస్థాయిలో నిండి శనివారం ఉదయం 8 గంటల ప్రాంతం నుంచి మొరువ పారుతున్నది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో చెన్నపట్నం చెరువుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. శనివారం చెన్నపట్నం జలాలకు జలహారతినిచ్చిన స్థానికులు.