*విద్యా, వైద్య, శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేస్తే సత్ఫలితాలు సాధించవచ్చు:జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
విద్యా, వైద్య, శిశు సంక్షేమ శాఖలు అతి ముఖ్యమైనవని వీరంతా కలసి సమన్వయం తో పని చేసి సత్ఫలితాలు దిశగా జిల్లాను ముందుకు తీసుకు వెళ్ళాలని పేర్కొన్నారు. పోషణ అభియాన్ కార్యక్రమం లో భాగంగా 8వ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమాన్ని "ఆరోగ్యవంత మైన మహిళా - శక్తి వంతమైన కుటుంబానికి బలమైన పునాది" అనే అంశం తో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు జిల్లా లో ఒక నెల పాటు నిర్వహించి జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాయచోటి లోని సుధా కన్వెన్షన్ హాల్ నందు మాసోత్సవాల ముగింపు కార్యక్రమం లో ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గారు.