కనిగిరి: వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడంలో ప్రభుత్వాలు విఫలం: కనిగిరిలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ రావు
కనిగిరి : పశ్చిమ ప్రకాశం జిల్లా కు వర ప్రసాదిని అయిన వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు మరియు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు విమర్శించారు. కనిగిరిలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వెలిగొండ జలాల సాధన సదస్సును శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన లక్ష్మణరావు మాట్లాడుతూ... వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడంలో గత వైసిపి ప్రభుత్వం కానీ, ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ శ్రద్ధ చూప లేదన్నారు. ప్రాజెక్టు పూర్తయితే 4.40 ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందుతుందన్నారు.