పటాన్చెరు: అమీన్ పూర్ లో ఓ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య వివరాలు వెల్లడించిన సీఐ నరేష్
శ్రీ అయామ్ సారీ, చీమలతో బ్రతకడం నావల్ల కాదు, తన్వి జాగ్రత్త అంటు ఓ మహిళా చీరతో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య పాల్పడింది. అమీన్ పూర్ సీఐ నరేష్ తెలిపిన వివరాలు ప్రకారం. మున్సిపాలిటీ పరిధిలోని నవ్య హోమ్స్‌లో నివసిస్తున్న మనీషా(25)(మైర్మేకోఫోబియా) చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకుంది. పటాన్ చెరు పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.