డోన్: బేతంచర్ల మండలంలో వర్షాల కోసం అన్నదాతల ఎదురుచూపులు
Dhone, Nandyal | Jul 10, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో జూన్లో మోస్తరు వర్షాలు కురవడంతో రైతులు ఖరీఫ్ సాగు ప్రారంభించారు. పంటలు విత్తిన తర్వాత 20 రోజులుగా వర్షాలు కురవకపోవడంతో పైర్లు ఎదుగుదల నిలిచిపోయింది. రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. రోజూ ఆకాశంలో మేఘాలు కనిపిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షం కురవడం లేదు.