జహీరాబాద్: మాడిగి అంతర్ రాష్ట్ర ఆర్టిఏ చెక్ పోస్ట్ పై ఏసీబీ దాడులు
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర ఆర్టిఏ చెక్పోస్ట్ పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున ఆర్టిఏ కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టి వాహనదారుల నుంచి అక్రమంగా వసూలు చేసిన 42 వేల 300 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయ రికార్డులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని తీసుకెళ్లారు. ఏసీబీ డిఎస్పి వివరాలను వెల్లడించారు.