నంద్యాల అర్బన్: పాణ్యం లో డీజిల్ కోసం క్యూ లైన్ లో ఘర్షణ, ఓ వ్యక్తికి గాయాలు
Nandyal Urban, Nandyal | Apr 24, 2026
శుక్రవారం పాణ్యం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద డీజిల్ కోసం క్యూలో నిలబడిన వ్యక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక వ్యక్తి గాయపడగా, అతన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లాలో పెట్రోలు, డీజిల్ కొరత కారణంగా వాహనదారులు బంకుల వద్ద పెద్దఎత్తున గుమిగూడుతున్నారు. ఘర్షణలో గాయపడిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.