కర్నూలు: ఉద్యోగుల డిమాండ్లపై సీఎం స్పందించిన తీరు హర్షనీయం: కర్నూలు లో ఏపీ ఎన్జీవో నాయకులు
ఉద్యోగుల డిమాండ్లపై సీఎం స్పందించిన తీరు హర్షనీయమని ఏపీ ఎన్జీవోస్ కర్నూలు నగర శాఖ అధ్యక్షుడు ఎంసీ కాశన్న అన్నారు. ఆదివారం ఉదయం 12 గంటలు ఏపీ ఎన్జీవోస్, ఏపీ జేఏసీ నాయకులు కర్నూలు కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు. దీపావళి కానుకగా నవంబర్ నుంచి ఒక డీఏను విడుదల చేయడం, 60 రోజుల్లో హెల్త్ కార్డుల వ్యవస్థను సక్రమంగా నడిపించేందుకు కమిటీని ఏర్పాటు చేసి ఇన్సూరెన్స్ విధానాన్ని పరిశీలించాలని ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.