అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం విరుపా పల్లి గ్రామంలో శ్రీ సూర్యనారాయణ స్వామి మఠంలో గురువారం అమావాస్యని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలను నిర్వహించారు. నారాయణస్వామి సమాధి వద్ద మఠం పీఠాధిపతి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆధ్వర్యంలో తమలపాకు తోరణాల పూజలు పంచామృత అభిషేకాలను నిర్వహించారు. భక్తులు తీర్థప్రసాదాల పంపిణీ తదుపరి భజన కార్యక్రమాలను చేపట్టారు.