శ్రీశైలంలో స్వర్ణ ఆంద్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం. పాల్గొన్న అన్ని విభాగాల సిబ్బంది
స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి భాగంగా స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో దేవస్థానం పరిపాలనాభవనంలో కూడా స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.దేవస్థానం ఉపకార్యనిర్వహణాధికారి రమణమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా అధికారులు మాట్లాడుతూ జీరో వేస్ట్ ఇనిస్టిట్యూషన్స్ అనే థీమ్‌తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంస్థ స్థాయిలో తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలను వేర్వేరుగా సేకరించడం, తడి చెత్తను సేంద్రియ ఎరువులుగా వాడాలి