కనిగిరి: పట్టణంలోని పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కల్తీ జరిగిందని స్థానికుల ఆందోళన
@ కనిగిరి పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద గల పెట్రోల్ బంకులో పెట్రోల్ కల్పి స్థానికులు సోమవారం రాత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు ద్విచక్ర వాహనదారులు తమ వాహనాల్లో పెట్రోల్ కొట్టించుకొని వెళ్లగా కొంత దూరం వెళ్లిన ద్విచక్ర వాహనాలు ఆగిపోయాయి. అనుమానం వచ్చిన వాహనదారులు కాళీ పెట్రోల్ బాటిల్స్ తీసుకువచ్చి అందులో పెట్రోల్ కొట్టించుకోగా, నీరు కలిసిన పెట్రోల్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెట్రోల్ బంకు వద్దకు చేరుకున్న పోలీసులు పెట్రోల్ విక్రయాలను నిలిపివేసి, పెట్రోల్ కల్తీని నిర్ధారించేందుకు శాంపిల్స్ ను తమ వెంట తీసుకువెళ్లారు.