ఒంగోలు అర్బన్: మావిగన్ ప్రపోజల్ తో ప్రజలు అమరావతిని మర్చిపోయారని వ్యాఖ్యానించిన ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు శివ ప్రసాద్ రెడ్డి
Ongole Urban, Prakasam | Apr 9, 2026
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రపోజల్ తో ప్రజలు అమరావతిని మర్చిపోయారని ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో వరదలు వస్తే కొట్టుకుపోయే అమరావతిని మేము వ్యతిరేకిస్తున్నామని అమరావతికి వ్యతిరేకం కాదని అన్నారు. సంవత్సరాలు సీఎం గా ఉన్న చంద్రబాబు అమరావతి ప్రాంత రైతులకు ఏమి చేశారన్నారు. అందుకే ధనాన్ని వృధా చేయకుండా గుంటూరు, విజయవాడ మచిలీపట్నాన్ని కలిపి రాజధానిని అభివృద్ధి చేయాలని తాము కోరుతున్నట్లు తెలిపారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆడవారిని అగౌరపరుస్తున్నారని అన్నారు