నందికోట్కూరు: 33 శాతం మహిళా రిజర్వేషన్.. మంత్రి నారా లోకేష్ నిర్ణయం అభినందనీయం: నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటించి మంత్రి నారా లోకేష్ మహిళా పక్షపాతిగా నిలిచారని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కొనియాడారు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు స్ఫూర్తితో సీఎం చంద్రబాబు ఆశలకు అనుగుణంగా మహానాడు వేదికగా మంత్రి నారా లోకేష్ ప్రకట చేయడం అభినందనీయమని ఎంపీ పేర్కొన్నారు, ఈ నిర్ణయం మహిళా లోకం తరతరాలుగా గుర్తించుకునే చారిత్రాత్మక సంఘటనఅని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు