నంద్యాల అర్బన్: తిరుమలకు కాలినడకన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
Nandyal Urban, Nandyal | Jun 18, 2026
వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో కూటమి పాలన రెండేళ్లు విజయవంతమైనదని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. బుధవారం తిరుమల తిరుపతి దర్శనార్థం కాలినడకన అలిపిరి మెట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్ర చేశారు. వారు మాట్లాడుతూ..పీఎం మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం అభివృద్ధి చెందుతుందని అన్నారు.