జిల్లా కలెక్టర్ ను కలిసి రైతు సమస్యలపై వినతి పత్రాన్ని అందజేసిన వైసిపి నేతలు
Ongole Urban, Prakasam | Apr 22, 2026
ప్రకాశం జిల్లా వైసీపీ నేతలు కలెక్టర్ రాజాబాబు ను తన కార్యాలయం లో కలిసి రైతుల సమస్యలు వివరించి వినతి పత్రాన్ని అందజేశారు. నియోజకవర్గాలలో కొంత మంది ఓటర్స్ ను తొలగించారు అని,దీనిపై స్పందించి వెంటనే తిరిగి ఆ ఓటర్స్ ను చేర్పించాలని కోరారు. ప్రధానంగా పండిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం కొన్ని రకాల పంటలకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంపై కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ,జిల్లాపరిషత్ చైర్మన్ వెంకాయమ్మ గారు,ఒంగోలు అసెంబ్లీ సమన్వయ కర్త చుండూరి రవి బాబు ,బంగారు బాబు,శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు