రాజేంద్రనగర్: మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్ కు పితృవియోగం
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్కు పితృవియోగం కలిగింది. మల్కాజగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్.. శ్రీరాముల యాదవ్ నివాసానికి ఈరోజు చేరుకుని అందెల ఆగమయ్య యాదవ్ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ఉన్నారు