డోన్: రంగాపురం మద్దిలేటి స్వామి ఆలయంలో ఘనంగా నరసింహస్వామి జయంతి ఉత్సవాలు
Dhone, Nandyal | Apr 30, 2026 నంద్యాల జిల్లా రంగాపురం శ్రీ లక్ష్మీ మద్దిలేటి స్వామి దేవస్థానంలో నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో అర్చకులు ఉత్సవమూర్తులకు గణపతి పూజ, తిరుమంజనం, సుగంధ ద్రవ్య స్నానాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది