సిర్పూర్ టి: కౌటాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్
కౌటాల పోలీస్ స్టేషన్ను అసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ గురువారం తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లోని రికార్డులు, రిసెప్షన్, పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీసు సిబ్బందితో మాట్లాడి వారి విధులకు సంబంధించిన పలు సూచనలు చేసి సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎల్లవేళలా ఫిర్యాదులు స్వీకరించడం, బాధితుల ఫిర్యాదులపై సత్ఫరం స్పందించి సేవలు అందించాలని పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సూచించారు,